![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-6 లో బ్యూటీ క్వీన్ గా వాసంతి కృష్ణన్ ని పిలుస్తారు. తన గ్లామర్ తో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది వాసంతి. హౌస్ లో ఉన్నన్ని రోజులు వెనుకాల ఉండి ఎక్కువగా గ్రూప్ లతో కలవకుండా ఉన్న వాసంతి.. ఇంకో వారంలో బయటకొస్తుందనే టైమ్ లో ఒక్కొక్కరితే కలవడం ప్రారంభించింది. కానీ అప్పటికే తనకి ఫ్యాన్ బేస్ లేకపోవడం, టాస్క్ లలో, గేమ్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడంతో తనకి నామినేషన్లలో ఓటింగ్ లిస్ట్ లో వెనుకబడింది. దాంతో హౌస్ నుండి బయటకొచ్చింది వాసంతి. అయితే బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి.
రీసెంట్ గా ఓటీటీలో విడుదలైన 'మ్యాచ్ ఫిక్సింగ్ ' మూవీలో హీరోయిన్ గా చేసింది. దాంతో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతో తనలోని మరో కోణాన్ని బయట ప్రపంచానికి తెలియజేసింది వాసంతి. అయితే ఎప్పుడు ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లతో ట్రెండింగ్ లో ఉండే వాసంతి.. తాజాగా తన బిగ్ బాస్ హౌస్ మేట్ పింకీ అలియాస్ సుదీపతో కలిసి ట్రెండింగ్ రీల్ చేసింది. అందులో పింకీతో కలిసి కొత్త స్టెప్పులతో అదరగొట్టింది.
పింకీ అలియాస్ సుదీప.. బిగ్ బాస్ సీజన్ -6 తో అందరికి సుపరిచితమైన నటి. అంతకముందు 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ కి చెల్లి పింకీగా చేసి మంచి పేరు తెచ్చుకుంది. అప్పటినుండి అందరూ ఆ సినిమాలో చేసినా పింకి కదా అని తనని అనేవారంట. దాంతో తన పేరుని సుదీప పింకి అని మార్చేసుకుంది. బిగ్ బాస్ లోకి వెళ్ళాక అక్కడ ఎక్కువ సమయం కిచెన్ లోనే గడిపిన సుదీపని అందరూ ఒక అమ్మగా చూసేవారే తప్ప.. తోటి కంటెస్టెంట్ గా ఎవరూ చూసేవారు కాదు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఎప్పుడు చూసిన పని పని అంటూ గడిపిన సుదీప..బయటకొచ్చాక ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తుంది.
అయితే బిగ్ బాస్ సీజన్-6 తర్వాత ఇంట్లోనే ఫ్యామిలీ తో గడుపుతూ బిజీగా ఉంటున్న పింకి అలియాస్ సుదీప.. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంది. కాగా తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ 'జైలర్' లోని 'నువ్వు కావాలయ్య' పాటకి వాసంతి, సుదీప కలిసి డ్యాన్స్ చేశారు. ఈ పాట ట్రెండింగ్ లో ఉండటంతో వీరిద్దరు ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు. కాగా ఇన్ స్టాగ్రామ్ లో వీళ్ళిద్దరు చేసిన ఈ స్టెప్పులకి మంచి వీక్షకాధరణ లభిస్తుంది.
![]() |
![]() |